హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వడగండ్ల వాన.. రైతులకు తీవ్ర నష్టం

కశ్మీర్‌లోని బండిపొరా, బారాముల్లా జిల్లాల్లో కురిసిన భారీ వడగండ్ల వాన, ఈదురుగాలులకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఆపిల్ తోటలు, ఇతర వ్యవసాయ పంటలు నేలకూలడంతో ఉత్తర కశ్మీర్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే స్పందించి నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక రైతాంగం కోరుతోంది.