హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాసేవే పోలీసుల పరమ ధ్యేయం: సీపీ శ్వేత

WGL: వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ముల్కనూరు పోలీస్ స్టేషన్‌ను వరంగల్ సీపీ శ్వేత తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మామిడి మొక్క నాటారు. డీసీపీ దార కవిత, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు