హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హులైన ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్'

ATP: జిల్లాలో అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు, అనర్హుల పేర్లను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. అక్టోబర్ 16న విడుదలయ్యే తుది జాబితాలో పేరు లేనివారు, తదుపరి అర్హత తేదీల్లో అర్హత పొందినవారు నిరంతర నవీకరణలో ఫారం-6 సమర్పించి, నమోదు చేసుకోవచ్చని సూచించారు.