హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. ఎన్ని గంటలంటే?

ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి కేంద్ర హోం శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని జన్ పథ్-కర్తవ్య పథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు నిలిపివేయనున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.