హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: లైబ్రరీ చైర్మన్

ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటువారిపల్లికి చెందిన కడారి మల్లేష్, జీవంతరావుపల్లికి చెందిన శివ భార్యను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.