హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: స్మశానవాటిక అభివృద్ధికి నిధుల విడుదల

కృష్ణా: పెడన పట్టణ హిందూ స్మశానవాటిక అభివృద్ధికి సీఎస్ఆర్ గ్రాంట్ల ద్వారా మంజూరైన రూ.1.80 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పేర్కొన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు స్మశానవాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.