హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమతి లేని నిరసనలు చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

రేపటి సీజేపీ నిరసన కార్యక్రమంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల అనుమతి లేని నిరసనలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనకు అనుమతి లేకపోతే వాటిని చట్టబద్ధంగా పరిగణించలేమంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగించాలని అధికారులకు కోర్టు సూచనలు చేసింది.