హైదరాబాద్: 28°C
వార్తలు

అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయొద్దు: సుప్రీం

సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసన హక్కులతో పాటు శాంతిభద్రతలు, ప్రజల రాకపోకలు చాలా ముఖ్యమని పేర్కొంది. అన్ని మెట్రో స్టేషన్లను ఏకపక్షంగా మూసివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మూసివేసి ఉన్న మెట్రో స్టేషన్ల సంఖ్యను వెంటనే తగ్గించాలని సుప్రీం సూచించింది.