హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్‌లో సినీనటి నిధి అగర్వాల్

SRD: జహీరాబాద్‌లో సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టులో ప్రేక్షకులకు, అభిమానులకు అభివాదం చేస్తూ.. తనదైన శైలిలో సందడి చేశారు. నటిని చూసేందుకు, పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.