అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు ఎంతో నైపుణ్యం కలవారని.. వారి సేవలు అక్కడి అభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడుతున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. వలసదారుల శ్రమతోనే US అభివృద్ధి చెందిందని, భారత ఐటీ ఉద్యోగుల వలస రెండు దేశాలకు లాభదాయకమేనని స్పష్టం చేసింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవని, స్పందించేటప్పుడు భాషను జాగ్రత్తగా వాడాలని హితవు పలికింది.
వార్తలు
జేడీ వాన్స్ భాష జాగ్రత్తగా వాడాలి: భారత్


