అమెరికా పర్మ్ ప్రోగ్రామ్ నుంచి 8 ఐటీ కంపెనీల సస్పెన్షన్‌పై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తాజా పరిణామాలను నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపింది. పర్మ్, H-1B వేర్వేరు అని.. ఇప్పటికే H-1B వీసా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది. అయితే గ్రీన్ కార్డుల ప్రక్రియపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిపై కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొంది.
వార్తలు
అమెరికా చర్యలపై భారత్ కీలక ప్రకటన


