హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీలకు సముచిత స్థానం: మంత్రి సత్యప్రసాద్

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా న్యాయం చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బీసీలకు పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు.