హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విపక్ష ఎంపీల భేటీ

ఎన్నికల సంఘం(ఈసీ) వివాదం నేపథ్యంలో దేశ రాజధానిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈసీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రతిపక్ష కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. విపక్ష నేతల అభ్యర్థన మేరకు రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ భేటీలో ఈసీ అధికారుల తీరు, ఓట్ల గల్లంతు తదితర అంశాలపై రాష్ట్రపతికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయనున్నాయి.