హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవాని దీక్ష చేపట్టిన కేంద్ర మంత్రి బండి

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం భవానీ దీక్ష చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనంతో మాలాధారణ చేసి 11 రోజుల దీక్ష ప్రారంభించారు. దసరా వరకు ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో తరించనున్నారు. నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల కోసం అన్నప్రసాద, వసతులను ఏర్పాటు చేశారు.