హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి స్థాపనలో యువతే కీలకం

ASR: ప్రపంచ శాంతికి అందరి సహకారం అవసరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఇవాళ అరకు వ్యాలీలో యూత్ ప్లే ఫర్ పీస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి నడవడిక, గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని నేర్పాలని సూచించారు. ఏజెన్సీలో యువత గంజాయి, మద్యం, సిగరెట్లకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.