హైదరాబాద్: 28°C
వార్తలు

మస్క్ ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందన

భారత్‌లో స్టార్ లింక్ ఎంట్రీపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. రంగం ఏదైనా గుత్తాధిపత్యాన్ని భారత్ ఎప్పటికీ అనుమతించబోదని స్పష్టం చేశారు. భద్రతాపరమైన నిబంధలన్నీ సరిచూసిన తర్వాత కార్యకలాపాలకు అనుమతినిస్తామని వెల్లడించారు. అది ఏ కంపెనీ అయినా నిబంధనలు ఒకేలా ఉంటాయని చెప్పారు.