హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాడవీధుల్లో 'వేద' సంస్కృతి.. కొత్త బోర్డుల ఏర్పాటు!

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధులకు టీటీడీ అధికారులు నాలుగు వేదాల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం పేర్లతో ఏర్పాటు చేసిన ఈ బోర్డులు భక్తులకు వేదాల ప్రాశస్త్యాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఈ బోర్డులను ఏర్పాటు చేశారు.