W.G: పెద్దపులి సంచారం నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి వద్ద పెద్దపులి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పెద్దపులి ఎటు వెళుతుందో అనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. తణుకు మండలం ముద్దాపురం, కోనాల తదితర ప్రాంతాల్లో తణుకు పోలీసులు పర్యటించి రైతులకు హెచ్చరికలు జారీచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటరిగా పొలాలకు వెళ్ళవద్దు: సీఐ


