హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ దుకాణాల్లో బయటపడ్డ మాఫియా

GDWL: జిల్లాలోని మెడికల్‌ దుకాణాల్లో అనుమతి లేని, నమూనా మందులు, నిబంధనలకు విరుద్ధంగా యాంటిబయాటిక్స్‌ ఔషధాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. పలు మార్లు అధికారులు తనిఖీలు చేస్తున్నా అమ్మకాలు మాత్రం కొనసాగుతున్నాయి. వీటిని కట్డడి చేసేందుకు ఔషధ నియంత్రణ శాఖ నిఘా కఠినతరం చేస్తోంది. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరగనున్నాయి.