హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోయిన ఫోన్‌ను గుర్తించిన పోలీసులు

KNR: కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు CEIR సాంకేతికతతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించారు. దుర్షేడ్‌కు చెందిన కర్ర అజయ్ గతేడాది ఫోన్‌ పోగొట్టుకోగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌ మంథనిలో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ నిరంజన్‌రెడ్డి ఫోన్‌ను బాధితుడికి అందజేసి, టెక్‌టీం కానిస్టేబుళ్లు రాంసాయి, రమేశ్‌లను అభినందించారు.