హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చిన్నారుల సంరక్షణపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి'

KNR: క్రిస్టియన్‌ కాలనీలోని బాలసదనం, శిశుగృహ కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా సందర్శించారు. చిన్నారులకు పౌష్టికాహారం, వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. స్మార్ట్‌ సిటీ నిధులతో నిర్మించిన బాలసదనం భవనంలో విద్యుత్‌, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించి, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.