హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థలో కార్యాలయం.. ప్రాణభయంలో సిబ్బంది!

JN: పాలకుర్తిలోని పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అధికారులు,సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనం దెబ్బతిని ప్రమాదకరంగా మారడంతో విధులు నిర్వహించడం భయానకంగా మారిందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.