హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికల్లో 82 శాతం పోలింగ్

BDK: మణుగూరు మండలంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 82 శాతం పోలింగ్‌ నమోదైంది. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఘటనలకు తావులేకుండా పోలీస్ పహరాలో ఎన్నికలు జరుగుతున్నాయి.