హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులతో పెట్టెలు మోయించిన వైనం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోర్టు ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థినులతో సందూక్ (ట్రంక్) పెట్టెలు మోయించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి హాస్టల్‌కు వచ్చిన పెట్టెలను విద్యార్థినులతోనే లారీ నుంచి అన్‌లోడ్ చేయించినట్లు తెలుస్తోంది. సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ బాలికలతో బరువైన సామగ్రి మోయించడంపై స్థానికులు ఆరోపించారు.