హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నదురుబాద-ఆరికరేవుల రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి

కోనసీమ: రాయవరం మండలంలోని నదురుబాద గ్రామం నుంచి ఆరికరేవుల వెళ్ళే గ్రావెల్ రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డును అభివృద్ధి చేస్తే విద్యార్థులు పాఠశాలలకు ఈ రోడ్డు లోనే వెళ్తారని, రైతులు, చిరు వ్యాపారులకు రాకపోకలు సులభతరం అవుతాయని విజ్ఞప్తి చేశారు.