NLG: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హాలియా SI బి.సాయి ప్రశాంత్ హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. అక్రమ ఇసుక రవాణాకు సహకరించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఇసుక విక్రయాలకు అనుమతులు ఇవ్వకుండా, ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా చేస్తే కేసులు: హాలియా ఎస్సై


