హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్యనారాయణ స్వామి ఆలయ విశేషాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. గోదావరి నది తీరానికి సమీపంలో వెలసిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కార్తీక మాసంలో ఆలయం భక్తులతో సందడిగా మారుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు.