హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గ్రామ దేవతగా కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు.