హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్‌లో ముక్త్యాల వాసి

NTR: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామానికి చెందిన యండ్రాతి రామారావు బెంగళూరులో జరిగిన 2వ ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్-2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. పలు దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ పోటీల్లో, 200 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో భారతదేశం తరఫున నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.