హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా తర్వాతే పత్తి కొనుగోళ్లు!

NLG: జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 26 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దసరా తర్వాతే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.కాగా, ఈ ఏడాది పత్తికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.8,667 మద్దతు ధరగా నిర్ణయించింది.