హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి సాగుపై రైతులకు అవగాహన..!

KMM: తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటలో సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సాంకేతిక పద్ధతులతో అధిక సాంద్రతలో పత్తి సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏవో సీతారామరెడ్డి తెలిపారు. నాగేశ్వరరావు పొలంలో పంటను పరిశీలించి, సమతుల్య ఎరువుల వాడకం, సస్యరక్షణపై రైతులకు సూచనలు చేశారు.