హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్‌, తాగునీరు, రహదారులు, భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌ ల వద్ద శుభ్రత, దీపాలు, బారికేడ్లు, మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.