హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కింగ్ ఫీజు వసూలుపై హైకోర్టు ఆగ్రహం

KMM: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కనీస సౌకర్యాలు లేకుండానే ఫీజులు వసూలు చేయడంపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ రాజ్, వజీద్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.