హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాల ఆర్టీసీ డిపోలో ఎన్నికల పోలింగ్

JGL: జగిత్యాల ఆర్టీసీ డిపోలో TGS RTC గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. డిపో పరిధిలో మొత్తం 302 ఓట్లు ఉండగా, ఉదయం 8 గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 17న ఓట్ల కౌంటింగ్ నిర్వహించి, తదుపరి ఫలితాలను వెల్లడించనున్నారు.