BHNG: జిల్లాలో పశువుల చోరీ కేసులు క్రమంగా పెరుగుతుండటం రైతులను కలవర పెడుతున్నాయి. గత మూడు నెలల్లో పదుల సంఖ్యలో పశువులు మాయమయ్యాయి. పగలు రెక్కీ నిర్వహించి వ్యవసాయబావులు, పశువుల కొట్టాల వద్ద ఉన్న గేదెలను, దూడలను అపహరించుకపోతున్నారు. భువనగిరి, వలిగొండ, ఆలేరు, మోత్కూరు పరిధిలో చోరీలు జరిగాయి. పోలీసులు గస్తీ పెంచి, నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గస్తీ పెంచండి సారూ..!


