ప్రకాశం: కొండపి మండలం కే ఉప్పలపాడు శివాలయంలో గురువారం రాత్రి నందీశ్వరునికి ప్రదోష అభిషేకం నిర్వహించారు. వేద పండితుడు రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ప్రదోషకాలంలో నందీశ్వరునికి అభిషేకంచేసి తన కోరికను నందీశ్వరుని చెవిలో చెప్తే ఆ కోరిక శివుడికి చేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నందీశ్వరునికి ప్రదోష అభిషేకం


