MHBD: గూడూరు మండలంలోని తీగలవేణి ZPHSకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 2న జిల్లాలో నిర్వహించిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ 2026లో 7వ తరగతి విద్యార్థులు జాటోత్ అమ్ములు, ధరావత్ దీపిక ప్రతిభ కనబరిచినట్లు HM ఫారుక్ తెలిపారు. ఈనెల 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు విద్యార్థుల ఎంపిక


