హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాటుసారా తయారీపై పోలీసుల ఉక్కుపాదం'

KRNL: హొలగుంద మండలం నేరణికి తండా అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 150 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.