హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసి డిపోలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్

SRD: ​నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ శుక్రవారం తెల్లవారుజామున ఉత్సాహంగా ప్రారంభమైంది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్మికులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.