హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు

ఆసిఫాబాద్ జిల్లా నుంచి జన్నారం మండలానికి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్యోగస్తులుగా, వ్యాపారులుగా స్థిరపడ్డారు. బతుకమ్మ, దసరా సెలవుల నేపథ్యంలో వారు సొంత గ్రామాలకు బయలుదేరనున్నారు. జన్నారం రావాలంటే మంచిర్యాల, ఉట్నూరు వరకు వచ్చి మరో బస్సు ఎక్కాల్సి ఉందని ఆరోపిస్తున్నారు.