హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నల్లగట్ల వద్ద లారీ బోల్తా

KRNL: ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి నాపరాళ్ల లోడుతో వెళ్తున్న లారీ టైరు పేలడంతో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. బేతంచెర్ల నుంచి చెన్నైకి వెళ్తున్న ఈ లారీ నల్లగట్ల వద్దకు రాగానే ఒక్కసారిగా టైరు పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నాపరాళ్లన్నీ పగిలిపోయాయి.