సహజీవనం చేసిన భాగస్వామిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రేమ వైఫల్యం, బ్రేకప్ వంటివి ఆత్మహత్యకు దారితీసినంత మాత్రన అన్నివేళలా దాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంగా చెప్పలేమని పేర్కొంది. పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటారని తెలియనప్పుడు సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయడం చెల్లదని చెప్పింది.
వార్తలు
'పెళ్లికి నిరాకరిస్తే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు'


