హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుకు అడ్డుగా కొమ్మలు.. వాహనదారులకు ఇబ్బందులు

SRCL: ముస్తాబాద్‌ మండలంలోని పోత్గల్‌ నుంచి ఆవునూర్‌ వెళ్లే రోడ్డులో కల్వర్టు వద్ద ముళ్లచెట్ల కొమ్మలు ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొమ్మల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.