హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు యువకులు

HNK: గంజాయి తాగుతున్న ముగ్గురు యువకులను మడికొండ పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట మండలం మడికొండ శివారులోని రామన్‌ పబ్లిక్‌ పాఠశాల సమీపంలో గురువారం తనిఖీలు నిర్వహించి వల్లెపు శివరాం, సందీప్‌, బోగి అరుణ్‌ల నుంచి 30 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిషన్‌ తెలిపారు.