హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి'

SRPT: సూర్యాపేట జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయానికి రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, వినియోగదారులపై భారంగా మారిన ట్రూ-అప్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.