హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఆంధ్ర అవార్డు గ్రహీతలకు ఎమ్మెల్యే సన్మానం

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో రెండు ప్రభుత్వ వసతి గృహాలకు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డులు రావడం అభినందనీయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా అవార్డులు అందుకున్న మోపిదేవి ఎస్సీ, తలగడదీవి బీసీ వసతి గృహాల HWOలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి, అభినందించారు.