JGL: అందరి సమన్వయంతో జగిత్యాలను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా 'జోష్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షయరహిత గ్రామాలుగా ఎంపికైన 7 గ్రామాలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. క్షయ బాధితులకు చికిత్సతో పాటు పౌష్టికాహార కిట్లు అందజేస్తామన్నారు.
వార్తలు
'క్షయ రహిత జిల్లాగా జగిత్యాలను మారుద్దాం'


