కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అగ్రిగోల్డ్ ఒరిజినల్ బాండ్ల పరిశీలన ఈనెల 9, 10న జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్లను పరిశీలించనున్నారు. బాధితులు ఒరిజినల్ బాండ్‌తో పాటు సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ తీసుకురావాలి. బ్యాంకు పాస్‌బుక్, ఫొటో తదితర అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
వార్తలు
నేటి నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన


