హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

WG: పెనుమంట్ర మండలం నేలమూరు, ఓడూరు గ్రామాల్లో గురువారం మీ భూమి - మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై 1175 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు.