హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ నిర్లక్ష్యం

కాకినాడ: కేవలం ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కాకినాడ రూరల్ వైసీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, జాతీయ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు.